నెల్లూరు పట్టణంలోని నారాయణపేటలో ఉన్న శ్రీ వెంకటాద్రి రైస్ మిల్లును జాయింట్ కలెక్టర్ హరీందర్ ప్రసాద్‌తో కలిసి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం పరిశీలించారు. రైస్ మిల్లులో జరిగే పరిణామ క్రమాలను మిల్లర్లను అడిగి తెలుసుకున్నారు. తడిసిన ధాన్యం, మిల్లు ఆడాక వచ్చే ధాన్యం, తవుడు, వాటికి ధర నిర్ణయం, గోడౌన్ల కొరతకు చేపట్టవలసిన చర్యలు, అకాల వర్షాలు వస్తే ధాన్యాన్ని ఆరబెట్టుకునే కల్లాలు వంటి అంశాలపై మంత్రి మేకపాటి అధ్యయనం చేశారు. మొత్తం ధాన్యం సేకరణలోని పరిణామ క్రమాల్లో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో అని.. రైస్ మిల్లు అంతా కలియతిరిగారు.
రైస్ మిల్లును పరిశీలించిన మంత్రి మేకపాటి - minister mekapati gowtham reddy latest news
రైతులు, మిల్లర్ల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. వారి ఇబ్బందులను తెలుసుకునేందుకు స్వయంగా నెల్లూరులోని రైస్ మిల్లును పరిశీలించారు. మిల్లర్లతో మాట్లాడుతూ రైస్ మిల్లు అంతా కలియతిరిగారు.
minister mekapati gowtham reddy
జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్ ఆనం విజయ కుమార్ రెడ్డి, ఆత్మకూరు వైకాపా టౌన్ కన్వీనర్ అల్లా ఆనంద్ రెడ్డి, సంగం మండలం వైకాపా కన్వీనర్ రఘునాథ్ రెడ్డి తదితరులు మంత్రి వెంట ఉన్నారు.