ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'క్రిస్మస్ రోజున చర్చిల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోండి' - Nellore District News

ఈ నెల 25 న క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చిల వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అనిల్ కుమార్ అధికారులను ఆదేశించారు.

నెల్లూరులో మంత్రి అనిల్ పర్యటన
నెల్లూరులో మంత్రి అనిల్ పర్యటన

By

Published : Dec 8, 2020, 4:11 PM IST

క్రిస్మస్ సందర్భంగా నెల్లూరులోని చర్చిల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. నగరంలోని 51వ డివిజన్ కపాడిపాళెంలో మంత్రి పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వర్షాలతో అపరిశుభ్రంగా తయారైన ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని ఆదేశించారు.

వెలగచెట్టు సంగంలో వసతులు మెరుగుపరస్తాం

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని వెలగచెట్టు సంగంలో వసతులు మెరుగుపరుస్తామని గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో చిన్నారులు ధర్నా చేపట్టారు. రోడ్లు, కాలువలు కావాలి.. ఎమ్మెల్యే, కమిషనర్ రావాలి అంటూ నినదించారు. స్పందించిన ఎమ్మెల్యే... కార్పొరేషన్ అధికారులతో కలిసి వెలగచెట్టు సంగంకు వెళ్లారు. స్థానికులతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. పది రోజుల్లో కరెంటు, తాగునీరు, కాలువల సమస్య పరిష్కరిస్తామని వెల్లడించారు.

ఇవీ చదవండి:

తల్లి మందలించిందని.. బాలిక ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details