నెల్లూరులో పర్యటించిన మంత్రి అనిల్ కుమార్...పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జనార్ధన్ రెడ్డి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
నెల్లూరులో నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తాం : మంత్రి అనిల్ - నెల్లూరులో మంత్రి అనిల్ కుమార్
నెల్లూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటు...భద్రతాపరంగా పటిష్ట చర్యలు చేపడతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నగరంలో నిఘా వ్యవస్థ మెరుగుపర్చేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తామన్నారు.
నెల్లూరులో మంత్రి అనిల్ కుమార్ పర్యటన
నగరంలోని 4, 53వ డివిజన్లలో కోటి రూపాయల వ్యయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. నెల్లూరులో ఇప్పటికే రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, మరో 12 కోట్ల రూపాయలతో మరిన్ని పనులు చేపట్టేందుకు చర్యలు చేపడుతామని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :'చిన్న పిల్లల పుస్తకాలపై సీఎం ఫొటోలు ఎందుకు?'