నెల్లూరు జిల్లాలోని కొవిడ్ ఆస్పత్రుల్లో లోపాలు తలెత్తితే సహించేది లేదని మంత్రి అనిల్‌కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం జీజీహెచ్‌లో సమస్యలకు సంబంధించి వెలుగు చూసిన వీడియో దృశ్యాలను మంత్రి పరిశీలించారు. వెంటనే విజయవాడ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో నెల్లూరు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో పని చేస్తోందని... కొందరు అధికారుల వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రణాళికతో పని చేసి కరోనా బాధితులకు మరింత సేవలను అందించాలని కోరారు.
కొవిడ్ ఆస్పత్రిలో తగిన జాగ్రత్తలు తీసుకోండి: మంత్రి అనిల్ - ఏపీలో కరోనా కేసులు
నెల్లూరు జిల్లా అధికారులతో మంత్రి అనిల్ కుమార్ విజయవాడ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని కొవిడ్ ఆస్పత్రుల్లో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

minister anil kumar