నెల్లూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. నగరంలోని బోడిగాడితోట దగ్గరున్న హిందూ శ్మశాన వాటికను మంత్రి పరిశీలించారు. ఐదు కోట్ల రూపాయలతో హిందూ శ్మశాన వాటికను, రెండు కోట్ల రూపాయలతో అల్లీపురం క్రిస్టియన్ శ్మశాన వాటికను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
నగర ప్రజలకు తాగునీటికి, రైతుల సాగునీటికి ఇబ్బందులు లేకుండా నెల్లూరు పెన్నా బ్యారేజ్ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందుకోసం మళ్లీ టెండర్లు పిలుస్తున్నట్లు చెప్పారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదే నెల్లూరులో 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.