Mekapati Rajamohan Reddy Press Meet: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు తాము అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నామని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రకటించారు. తమ కుటుంబంలో అనుకోని విషాదం చోటు చేసుకోవడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైందని.. తప్పనిసరి పరిస్థితుల్లో తన రెండో కుమారుడు విక్రమ్ రెడ్డిని పోటీకి నిలబెట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఉప ఎన్నిక ఏకగ్రీవం చేసుకునేందుకు తాము ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదన్నారు. ఎన్నిక జరిగే సమయంలో కుటుంబ సభ్యులే పోటీకి నిలబడితే ఎన్నికకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంటోందని.. అదే సాంప్రదాయం ఆత్మకూరులోనూ కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలో భాజపా పోటీకి నిలబడే అవకాశం ఉన్నప్పటికీ.. తాము మంచి మెజారిటీతో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Mekapati Family: ఆత్మకూరు ఉపఎన్నికకు సిద్ధంగా ఉన్నాం: మేకపాటి రాజమోహన్ రెడ్డి - ఆత్మకూరు ఉప ఎన్నిక వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి
Mekapati Family on Atmakur bypoll: ఆత్మకూరు ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసుకునేందుకు తాము ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. ఎన్నికకు తాము అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. ఉప ఎన్నిక విషయంలో తెదేపా నిర్ణయం పట్ల ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు.
Mekapati Goutham Reddy on Atmakur bypoll: ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆత్మకూరు ఉపఎన్నిక వైకాపా అభ్యర్థి విక్రమ్ రెడ్డి అన్నారు. దివంగత, మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని విక్రమ్ రెడ్డి వెల్లడించారు. జూన్ 2న నామినేషన్ వేస్తున్నామని.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరు అవుతారని చెప్పారు. ఈ ఎన్నికలో మంచి మెజారిటీతో గెలుపొందుతామని విక్రమ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: