సమస్యల పరిష్కరం కోసం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు కార్మికుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ.. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. పోర్టు యాజమాన్యం మారిన తర్వాత తొలగించిన కార్మికులను.. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చట్ట ప్రకారం రావాల్సిన గ్రాట్యుటీ, బోనస్, ఓటీ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. 8 గంటల పని విధానం కొనసాగించాలన్నారు. కార్మిక సమస్యలపై యాజమాన్యం స్పందించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.