తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. సీఐటీయూ ఆధ్వర్యంలో కృష్ణపట్నం పోర్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి.. అక్కడ ధర్నాకు దిగారు. విధుల నుంచి తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని.. పెండింగ్ బకాయిలు చెల్లించాలని నినాదాలు చేశారు.
కలెక్టర్ కార్యాలయం వద్ద కృష్ణపట్నం పోర్టు కార్మికుల నిరసన
నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు.. కృష్ణపట్నం పోర్టు కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. కొన్ని రోజులుగా కార్మికులు పోరాడుతున్నా పట్టించుకోవడంలేదంటూ మండిపడ్డారు.
నెల్లూరు కలెక్టరేట్ వద్ద కృష్ణపట్నం పోర్టు కార్మికుల నిరసన
సమస్యల పరిష్కారం కోసం కొన్ని రోజులుగా కార్మికులు పోరాడుతున్నా పట్టించుకోవడంలేదంటూ.. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం స్పందించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:'ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ, దాడులు చేస్తారా?'