‘కార్పొరేషన్‌లో ఒక్క రూపాయి లేదు.. నేనేమీ చేయలేను..’ అంటూ నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తేల్చిచెప్పారు. ‘నేను.. నా కార్యకర్త' కార్యక్రమంలో భాగంగా ఆయన శనివారం నెల్లూరు నగరంలో 18వ డివిజన్ హరనాథపురం ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలోని కార్యకర్త ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో స్థానికులు డివిజన్‌లో డ్రైనేజీని నిర్మించాలని, మినీబైపాస్‌కు అనుసంధానంగా రోడ్డు వేయించాలని కోరడంతో వారికి పైవిధంగా ఆయన సమాధానమిచ్చారు. ‘మీరందరూ చదువుకున్న వాళ్లు.. మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. హామీలిచ్చి అదిగో ఇదిగో అంటూ మాట తప్పలేను.. పరిస్థితిని అర్థం చేసుకోండి’ అని బదులిచ్చారు. సంక్షేమ పథకాల కారణంగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేని పరిస్థితి నెలకొందన్నారు. విషయాన్ని ఎమ్మెల్యేలందరం సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. త్వరలోనే నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. నిధులు వస్తే తప్పకుండా పనులు చేస్తామన్నారు.
kotam reddy sredhar reddy:' నిధుల్లేవ్.. నేనేమీ చేయలేను' - నెల్లూరు అభివృద్ధి తాజా వార్తలు
అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల్లేవని.. తానేమి చేయలేనని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల కారణంగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేని పరిస్థితి నెలకొందన్నారు.
kotam reddy sredhar reddy