ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ ఊర్లో.. జనం కంటే కోతులే ఎక్కువ - కొండూరు గ్రామంలో కోతులు

వానరాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. గుంపులు గుంపులుగా వచ్చి మహిళలు, చిన్నారులపై దాడి చేస్తున్నాయి. గతంలో అడవుల్లో కనిపించే కోతులు ప్రస్తుతం పల్లెల్లో సంచరిస్తున్నాయి. చెట్లను నరికి వేయడం.. స్థావరాలు లేక గ్రామాల్లో ఇళ్లలోకి చేరుకుంటున్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 15 రోజుల్లో 50మందిపై కోతులు దాడి చేశాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.

monkeys
monkeys

By

Published : Dec 25, 2019, 8:01 PM IST

ఆ గ్రామ ప్రజల కన్నా...కోతుల మంద ఎక్కువ

నెల్లూరు జిల్లా ఏ.ఎస్.పేట మండలం కొండమీద కొండూరు గ్రామంలో కోతుల బెడదకు గ్రామ ప్రజలు వణికిపోతున్నారు. కూలి పనికి వెళ్లి వస్తున్న మహిళలపై కోతుల మంద దాడి చేయడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 15 రోజుల వ్యవధిలో ఈ గ్రామంలో సుమారు 50 మందికి పైగా గ్రామస్తులు కోతుల దాడిలో గాయాలపాలయ్యారు.

గ్రామంలో ఉండాలంటే తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానరుల భయంతో తమ పిల్లలను స్కూలుకు పంపించడం లేదంటున్నారు. ఇంట్లో అన్నం వండాలన్నా... ఏదైనా తినాలన్నా.. కోతుల దెబ్బకు భయపడుతున్నామన్నారు. చివరికి గ్రామంలోకి కూరగాయలు, పండ్లు అమ్మేవాళ్లూ రావడం మానేశారని తెలిపారు. కోతుల బారి నుంచి తమను రక్షించాలని అధికారులను వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details