నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఐసీఎంఆర్ బృందం పర్యటనపై జేసీ గణేశ్‌కుమార్ వివరణ ఇచ్చారు. ఐసీఎంఆర్ బృందం పర్యటనపై తమకు ఎటువంటి అధికారిక సమాచారం లేదని పేర్కొన్నారు.
ఆనందయ్య మందుపై క్షేత్రస్థాయి సర్వే జరుగుతోందని, ఇప్పటికే ఔషధ నమూనాలను ఆయుష్ బృందం సేకరించిందని ఆయన అన్నారు. మందు పనితీరు, ఇతర అంశాలపై దిల్లీలోనూ పరిశోధన జరుగుతున్నట్లు జేసీ స్పష్టం చేశారు.