రాష్ట్ర ప్రభుత్వం పేదలకిచ్చేందుకు సిద్ధం చేసిన ఇళ్ల స్థలాల లేఅవుట్లో జనసేన నాయకులు చేపలు పట్టారు. మంగళవారం నెల్లూరు భగవత్సింగ్ కాలనీలో జగనన్న లేఅవుట్ను నెల్లూరు జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి పరిశీలించారు. పేదలకు ఇచ్చే స్థలంతోపాటు ఒక పడవ, లైఫ్జాకెట్ ఇవ్వాలని ఆయన ఎద్దేవా చేశారు. చిన్నపాటి వర్షానికే ఆరడుగుల లోతులో నీరు నిలిచే ప్రాంతాలను పేదలకు కేటాయించారని మండిపడ్డారు.
పేదల కోసం సిద్ధం చేసిన ఇళ్ల స్థలాల లేఅవుట్లో జనసేన చేపల వేట
నెల్లూరు జిల్లాలో ప్రభుత్వం పేదల కోసం సిద్ధం చేసిన ఇళ్ల స్థలాల లేఅవుట్లో జనసేన నేతలు చేపలు పట్టారు. చిన్నపాటి వర్షానికే లేఅవుట్లో ఆరడుగుల లోతు నీరు చేరిందని..అలాంటి భూములను పేదలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు.
nlr-fish