WOMENS DAY SPECIAL: నెల్లూరు ఆర్యవైశ్య మహిళా విభాగం మహిళా దినోత్సవాలు వినూత్నంగా సాగాయి. సభ్యులంతా ఒకచోట చేరి బాల్యంలో తాము ఆడిన ఆటలు ఆడుకున్నారు. వామనగుంట, పాము పటం ఆట, తొక్కడు బిళ్ల, అచ్చనకాయ, రింగ్ బాల్, చెమ్మచెక్క, కళ్ల గంతలు ఇలా 12 రకాల ఆటలు ఆడారు.
"ఇప్పటి తరం పిల్లలు మమ్మీ.. ట్యాబ్ ఉందా..? మొబైల్ ఉందా..? అని అడుగుతున్నారు. మా కాలంలో అచ్చనకాయ, బారాకట్టా, తొక్కుడు బిల్ల, స్కిప్పింగ్, రింగ్బాల్.. ఇలా ఎన్నెన్నో ఆడేవాళ్లం. కానీ ప్రస్తుత తరం పిల్లలు మాత్రం ఏదీ ఆడటం లేదు. దీనివల్ల ఊబకాయంతో పాటు అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. పాతకాలం ఆటల వల్ల ఎక్కువ శ్రమ కలిగి ఆరోగ్యంగా ఉంటారు."- మహిళలు
WOMENS DAY SPECIAL: చిన్ననాటి ఆటలేకాదు బాల్యంలో తాము బాగా ఆస్వాదించిన అపురూప గీతాలకు నృత్యాలు చేశారు. చిన్నతనంలో తాము ఆ పాటలకు డాన్సులు వేయలేకపోయామని... ఇప్పుడు ఆ సరదా తీరిందంటూ సంబరపడ్డారు.