ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సులభ సంపాదనే ధ్యేయంగా... నెల్లూరులో బీమా మోసం - సులభ సంపాదన కోసం నెల్లూరులో బీమా మోసం

'ఫ్యూచర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ' పేరిట నకిలీ బీమా పత్రాలతో మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరుకి చెందిన బాలమురళీకృష్ణతో పాటు అతడి భార్యకూ ఇందులో భాగమున్నట్లు డీఎస్పీ హరనాథ్ రెడ్డి తెలిపారు. వారి నుంచి సామగ్రిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

police arrested insurance cheater in nellore city
నెల్లూరులో బీమా మోసగాడు అరెస్ట్

By

Published : Mar 23, 2021, 7:22 PM IST

బీమా పేరుతో ప్రజలను మోసగిస్తున్న బాలమురళీకృష్ణ అనే వ్యక్తిని.. నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది జరిగిన ద్విచక్రవాహనం, ట్రాక్టర్ ప్రమాదంతో.. ఈ మోసం బయటకొచ్చింది. ప్రమాదంలో నష్టపోయిన బాధితుడు బీమా కోసం దరఖాస్తు చేసుకోగా.. అవి నకిలీ పత్రాలని తేలింది. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో గుర్తించారు.

నెల్లూరులోని రవాణాశాఖ కార్యాలయం వద్ద దుకాణం ఏర్పాటు చేసిన నిందితుడు.. వాహనాలకు నకిలీ బీమాపత్రాలు ఇస్తున్నట్లు డీఎస్పీ హరనాథ్ రెడ్డి వెల్లడించారు. 'ఫ్యూచర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ' పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి.. ఆ సొమ్ము సొంతానికి వాడుకుంటున్నట్టు చెప్పారు. నిందితుడితో పాటు అతని భార్యకూ ఇందులో ప్రమేయం ఉందని తేలిందన్నారు. వందలాది మందిని మోసగించి లక్షల దండుకున్నట్లు అనుమానం ఉందని చెప్పారు. నిందితుల నుంచి ప్రింటర్లు, కంప్యూటర్, నకిలీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details