నెల్లూరు నగరంలోని నక్కా గోపాల్ నగర్‌లో పేదల గుడిసెల దగ్ధం వివాదాస్పదమవుతోంది. గత రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తమ గుడిసెలు దగ్ధం చేశారని, ఇందుకు పోలీసులు కూడా సహకరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికుల ఆరోపణలను పోలీసులు ఖండించారు. ఆ స్థలం ప్రభుత్వానిదో, ప్రైవేటు వారిదో తమకు తెలియదని నెల్లూరు డీఎస్పీ స్పష్టం చేశారు. గత రాత్రి జరిగిన ఘటనపై ఇంతవరకూ ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు.
huts fire : వివాదాస్పదంగా మారుతున్న గుడిసెల దగ్ధం - nellore crime
నెల్లూరు నక్కా గోపాల్ నగర్‌లో గుడిసెల దగ్ధం వివాదం ముదురుతోంది. గుడిసెలు ఉన్న స్థలం ప్రభుత్వానిదా?, ప్రైవేటు వారిదా? అనేది తమకు తెలియదని పోలీసులు అన్నారు.
వివాదాస్పదంగా మారుతున్న గుడిసెల దగ్ధం