ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హెల్మెట్​ వినియోగంపై యువత వినూత్న ర్యాలీ.. - nellore

హెల్మెట్ లేని కారణంగా తమ స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రంగా గాయమై ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడని... అలాంటి దుస్థితి మరెవరికీ రాకూడదనే ఉద్దేశంతో హెల్మెట్​పై నెల్లూరులో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

తమ ఫ్రెండ్ దుస్థితి ఎవరికీ రావద్దంటూ...హెల్మెట్ పై అవగహన ర్యాలీ

By

Published : Aug 27, 2019, 11:43 PM IST

తమ ఫ్రెండ్ దుస్థితి ఎవరికీ రావద్దంటూ...హెల్మెట్ పై అవగహన ర్యాలీ
హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ నెల్లూరులో ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్సపొందుతున్న రఫీ అనే యువకుడి పరిస్థితి మరెవరికీ రాకుండా... ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడాలని కోరుతూ అతని స్నేహితులు ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. నెల్లూరు వెంకటేశ్వరపురానికి చెందిన రఫీ...హైదరాబాదులో మల్టీమీడియా కోర్స్ చేస్తున్నాడు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తుండగా సూర్యాపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడ్డాడు. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే రఫీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని... ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని స్నేహితులు విజ్ఞప్తి చేశారు. రఫీ త్వరగా కోలుకోవాలంటూ సర్వమత ప్రార్థనలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details