నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల వల్ల వాగులు పొంగుతున్నాయి. జిల్లాలోని పలు గ్రామాలు, కాలనీలు(heavy rains in nellore district lead to flood water in villages) నీటమునిగాయి. నెల్లూరు భగత్‌సింగ్‌కాలనీ, నవాబ్పేటలు నీటమునిగాయి. ముంపు ప్రాంత ప్రజలను పోలీసులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వెంకటేశ్వరపురంలోని టిడ్కో ఇళ్లు నీటమునిగాయి. నెల్లూరు జిల్లాలో పెన్నా నది ఉగ్రరూపం దాల్చడంతో.. పొర్లుకట్టలు కోతకు గురయ్యాయి. జిల్లాలోని ఇందుకూరుపేట పేట మండలం ముదివర్తి పాలెం వద్ద ఉన్న పెన్నా పొర్లు కట్ట తెగిపోవడంతో 5 గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. ముదివర్తి పాలెం, నిడు ముసలి, కె ఆర్ పాలెం, రాముడు పాలెం గ్రామాలు జలదిగ్భంధంలోకి వెళ్లిపోయాయి. కృష్ణపట్నం చిన్న తూముల వద్ద విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
వరద ముంపులో గ్రామాలు.. రైతు మృతి
గతంలో ఎన్నడూ లేనివిధంగా వరద పోటెత్తడంతో పెన్నా నది తీరంలోని గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వరద తీవ్రతకు బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట మండలాల్లో పోర్లుకట్టలు కోతకు గురయ్యాయి. ఫలితంగా వరద ప్రవాహం గ్రామాలపై పడి, నివాసాలను ముంచెత్తింది. బుచ్చి మండలంలోని పెనుబల్లి, మినగల్లు, కాకులపాడు, దామరమడుగు, పల్లిపాలెం గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ఇందుకూరుపేట మండలంలోని కుడితిపాళెం, ముదివర్తిపాళెం, రాముడుపాళెం, విడవలూరు మండలంలోని ముదివర్తి, పొన్నపుడి, ఊటుకూరు, కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాళెం గ్రామాలు జలదిగ్భంధమయ్యాయి. అర్ధరాత్రి వరద తీవ్రత అధికమై నివాసాల్లోకి నీరు చేరడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. బుచ్చి మండలం శ్రీరంగరాజపురం గ్రామానికి చెందిన బుజ్జయ్య అనే రైతు పొలం వద్ద ఉండగా, ఒక్కసారిగా వరద చుట్టుముట్టడంతో నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. మరోపక్క ముంబయి జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ స్తంభించింది. ఆత్మకూరు వద్ద జాతీయ రహదారిపై వరద నీరు చేరుకోవడంతో.. పలుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సంగం మండలం కోలగట్ల, బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద రహదారులపై వరద ప్రవహిస్తోంది.
సోమశిలకు పోటెత్తిన వరద..