liquor bottles seized: నెల్లూరు జిల్లాలో భారీ మొత్తంలో అక్రమ మద్యం పట్టుబడింది. మాగుంట లేఅవుట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఇందులో 23లక్షల రూపాయల విలువైన 18వేల మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. 8మందిని అరెస్ట్ చేశారు. 8మంది వ్యక్తులు గోవా నుంచి తక్కువ ధరకు మద్యం సీసాలు తెచ్చి లేబుళ్లు మార్చి ఎక్కువ ధరకు అమ్ముతున్నారని గుర్తించారు. ఈ అక్రమ దందాకు ఇద్దరు ప్రభుత్వ మద్యం దుకాణాల సూపర్ వైజర్లూ సహకరిస్తున్నారు. తారు ట్యాంకర్ వాహనం ద్వారా పోలీసుల కళ్లు కప్పి మద్యం తరలిస్తున్నారు. నెల్లూరు నుంచి మైపాడు సముద్రతీరం వైపు తీసుకెళ్లి నిల్వ చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ విజయారావుకు వివరాలు వెల్లడించారు.
నెల్లూరులో భారీగా మద్యం బాటిళ్లు సీజ్... - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
liquor bottles seized: నెల్లూరు జిల్లాలోని మాగుంట లేఅవుట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. రూ.23లక్షల విలువైన 18వేల మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. 8మందిని అరెస్ట్ చేశారు.
నెల్లూరులో భారీగా మద్యం బాటిళ్లు సీజ్