ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి.. స్వల్ప గుండెపోటు - అపోలో ఆస్పత్రిలో నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే
18:13 May 27
చెన్నై అపోలో ఆస్పత్రికి తరలింపు
Heart attack to MLA Kotamreddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆమంచర్ల గ్రామం వద్ద 'గడప గడపకు కోటంరెడ్డి బాట' కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు గుండె నొప్పి రావడంతో హుటాహుటిన నగరంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించడంతో పరిస్థితి కాస్త మెరుగుపడింది. విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి కోటంరెడ్డిని పరామర్శించారు. సాధారణ స్థితి కంటే హార్ట్‌బీట్ రేట్ పెరిగి, బీపీ తగ్గిందని, చికిత్స అనంతరం సాధారణ స్థితికి వచ్చిందని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స నిమిత్తం కోటంరెడ్డిని నెల్లూరు నుంచి చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చదవండి: