Nellore District News: నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైకాపా సోషల్ మీడియా డివిజన్ కోఆర్డినేటర్ కృష్ణారెడ్డితో.. తనకు ప్రాణహాని ఉందని ఓ యువతి మానవ హక్కుల కమిషన్‌ని ఆశ్రయించింది. కృష్ణారెడ్డి నుంచి తనను రక్షించాలని కమిషన్ను కోరింది. 'నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరానికి చెందిన కృష్ణారెడ్డి.. వైకాపా జిల్లాకు చెందిన ఓ యువతితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. అనంతరం శీతల పానీయంలో మత్తుమందు కలిపి నగ్నంగా ఫోటోలు తీసి బెదిరింపులతోపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఇద్దరికి పెళ్లి చేసిన పెద్దలు.. కేసును వెనక్కి తీసుకోవాలని చిత్రహింసలకు గురి చేశారు. ఇద్దరు పెళ్లి చేసుకున్న తరువాత కూడా అదనపు కట్నం కావాలంటూ వేధించడంతో హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణారెడ్డి నుంచి తనను ప్రాణహాని ఉంది.. రక్షించండి' అంటూ బాధితురాలు హెచ్ఆర్సీని ఆశ్రయించినట్లు కమిషన్ సభ్యులు తెలిపారు. అయితే నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. బాధితురాలు ప్రస్తుతం హెచ్‌ఆర్‌సీ పర్యవేక్షణలో ఉందని సభ్యులు వెల్లడించారు.
అత్యాచారం చేసి.. పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత మళ్లీ
Complaint on ycp social media coordinator: ఓ తప్పు చేశాడు.. పెద్దలంతా కలిసి సరిదిద్దారు.. ఆ తర్వాతనైనా సరిగ్గా ఉంటాడేమోననుకుంటే మరింత రెచ్చిపోయాడు.. అతని భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. తనకు ప్రాణహాని ఉంది రక్షించాలంటూ హెచ్ఆర్సీని ఆశ్రయించడంతో ఆత్మకూరు వైకాపా సోషల్ మీడియా డివిజన్ కోఆర్డినేటర్ అరాచకాలు బయటపడ్డాయి.
వైకాపా సోషల్ మీడియా డివిజన్ కో ఆర్డినేటర్పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు