Guinness World Record Painting : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్.. ఈ టైటిల్ ని సొంతం సొంతం చేసుకోవటం అంత సులువేమీ కాదు. ఎంతో మంది తమ ప్రతిభను చాటుకునేందుకు..తమ పేరు ఆ పుస్తకంలో ఎక్కేందుకు.. ఎన్నో ఏళ్లుగా అహర్నిశలూ శ్రమిస్తూ ఉంటారు. ఆ కోవలోకి చెందిన వ్యక్తే.. నెల్లూరుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు అమీర్ జాన్. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును సాధించేందుకు అమీర్ జాన్.. భారీ స్పైస్ చిత్రాన్ని గీశాడు. ఆరున్నర గంటల్లో 790 అడుగుల చిత్రం గీసి.. అందరి చేతా ఔరా అనిపించాడు.
నెల్లూరుకి చెందిన చిత్రకారుడు అమీర్ జాన్ బహుముఖ చిత్రాలను గీస్తారు. విభిన్న చిత్రాలు గీసి 40కి పైగా రికార్డులు సొంతం చేసుకున్నారు. గిన్నిస్ బుక్లో స్థానం సాధించాలనే లక్ష్యంతో.. మహారాష్ట్రలోని ఆదివాసీ మహిళలు రూపొందించిన వర్లీ చిత్రకళను రూపొందించారు. అమీర్‌జాన్ తన పెయింటింగ్ కోసం కాలం చెల్లిన, పనికి రాని కారం, పసుపు పొడులను ఉపయోగించారు. ఫుడ్ సెఫ్టీ అధికారి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ అధికారుల సమక్షంలో ఈ చిత్రాన్ని గీశారు. మొత్తం 25 కళాసంఘాల అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి :మూడు నెలలుగా స్మార్ట్ ఫోన్లో గేమ్స్... ఆ తర్వాత పరిస్థితి చూస్తే..
Largest Spice Painting : 790అడుగుల చిత్రాన్ని 6 గంటల30నిమిషాల్లో చిత్రీకరించారు. ఉత్తరప్రదేశ్ చిత్రకారుడి పేరుతో ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం పంపేందుకు ఈ కార్యక్రమం మొత్తాన్ని వీడియో తీయించారు. అమీర్‌జాన్ 30ఏళ్లుగా పాఠశాల నిర్వహిస్తున్నారు. సేవా భావంతో విద్యార్ధులకు చిత్రకళనూ నేర్పిస్తున్నారు. గిన్నిస్ రికార్డు సాధించటమే లక్ష్యంగా... భారీ స్పైస్ పెయింటింగ్ వేసినట్లు చెప్పారు.