Gravel excavations: నెల్లూరు జిల్లా సంగం మండలంలోని తిరమనతిప్పపై జోరుగా గ్రావెల్ తవ్వకాలు కొనసాగుతున్నాయి. అనుమతులు లేకపోయినా కొందరు నేతలు మూడు జెసిబిలు, పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లతో యథేచ్ఛగా గ్రావెల్ తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుత్తేదారులు స్థానిక అవసరాల ముసుగులో అక్రమ గ్రావెల్ తో ఇసుక తరలించేందుకు బాటలు వేసుకుంటున్నారని వాపోయారు. ప్రభుత్వం ఐటిఐ కళాశాల కోసం ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల్లో తవ్వకాలతో భారీగా గుంతలు ఏర్పడుతున్నాయని వివరించారు. భవిష్యత్తులో కళాశాల నిర్మించాలంటే చదును చేయాల్సి వస్తుందని, ఇబ్బందులు పడక తప్పదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
Gravel excavations: అనుమతులు లేవు..అయినా తవ్వేస్తున్నారు... - Gravel excavations in Sangam
Gravel excavations: నెల్లూరు జిల్లా సంగం మండలంలోని తిరమనతిప్పపై జోరుగా గ్రావెల్ తవ్వకాలు కొనసాగుతున్నాయి. అనుమతులు లేకపోయినా కొందరు నేతలు యథేచ్ఛగా గ్రావెల్ తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తిరమనతిప్పపై జోరుగా గ్రావెల్ తవ్వకాలు