రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల వారోత్సవాలు ఘనంగా జరిగాయి. గుంటూరు పోలీస్ పరేడ్ మైదానంలో డీఐజీ త్రివిక్రమ్ వర్మ, గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ విద్యార్థులకు ఆయుధాలు, వాటి వినియోగంపై అవగాహన కల్పించారు. నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానంలో ప్రదర్శనకు ఉంచిన వివిధ రకాల పోలీసుల ఆయుధాలను వీక్షించేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి విద్యార్ధులు తరలివచ్చారు. అనంతపురం జిల్లా గుంతకల్లు ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి డీఎస్పీ నర్సింగప్ప హాజరయ్యారు. పోలీసులు విధి నిర్వహణలో.. ఏ ఆయుధాలు, ఎలాంటి సాంకేతికత వినియోగిస్తారో విద్యార్థులకు అవగాహన కల్పించారు.
POLICE : రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా పోలీస్ అమరవీరుల వారోత్సవాలు - grandly celebrated of police day in andhrapradhesh
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా పోలీస్ అమరవీరుల వారోత్సవాలు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఓపెన్ హౌస్ పేరిట ఆయుధ ప్రదర్శన నిర్వహించారు. ఆయుధాల వినియోగంపై గుంటూరు డీఐజీ గ్రామీణ ఎస్పీ అవగాహన కల్పించారు. నెల్లూరు పోలీస్ పరేడ్ ప్రదర్శనకు విద్యార్థులు భారీగా తరలివచ్చారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఓపెన్ హౌస్ పేరిట ఏర్పాటు చేసిన ఆయుధాల ప్రదర్శనకు విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. పోలీస్ క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్స్ బ్యూరో ఉపయోగించే పరికరాలు, పోలీసు జాగిలాలు, మెటల్ డిటెక్టర్, బాంబ్ డిస్పోజబుల్ పరికరాలు, డ్రోన్ కెమెరా తదితర పరికరాలను ప్రదర్శనకు ఉంచారు. జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గ పోలీస్ స్టేషన్ నమునా ప్రదర్శన విద్యార్థుల్ని ఆకట్టుకుంది. ఏకే47, 9 ఎంఎం గ్లాక్ పిస్టల్, లైట్ మెషిన్ గన్, 380రివాల్వర్, గ్రైనైడ్లు వంటి ఆయుధాల్ని విద్యార్ధులు ఆసక్తిగా తిలకించారు.
ఇవీచదవండి.