గిరిజన పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్న గంగాధర్ ట్రస్ట్ - nellore gangadhar charitable trust news
లాక్డౌన్ సమయంలో పనులు లేక ఇబ్బంది పడుతున్న వారికి పలు స్వచ్ఛంద సంస్థలు తమవంతు తోడ్పాటును అందిస్తున్నాయి. నెల్లూరులో గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మారుమూల గ్రామాల్లోని గిరిజన పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తుంది.
![గిరిజన పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్న గంగాధర్ ట్రస్ట్ గిరిజన పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్న గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7101496-942-7101496-1588860062996.jpg)
గిరిజన పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్న గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్
లాక్డౌన్ నేపథ్యంలో నెల్లూరులో గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ పేదలకు తనవంతు చేయూతనందిస్తోంది. కరోనాను ఎదుర్కొనేందుకు పిల్లలకు అవసరమైన పౌష్టికాహారాన్ని నిత్యం పంపిణీ చేస్తోంది. నగరంలోని దీన్ దయాల్ నగర్ ప్రాంతంలో దాదాపు 275 మంది గిరిజన పిల్లలకు పౌష్టికాహారం అందజేసింది. దాతల సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపకుడు గంగాధర్ తెలిపారు.