Road Accident: కృష్ణా జిల్లా కంకిపాడు-గుడివాడ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలవపాముల కూడలి వద్ద ఎదురెదురుగా వస్తున్న ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఉయ్యూరు రూరల్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Road accident: వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. నలుగురు మృతి - కృష్ణా జిల్లా నేర వార్తలు
Road Accident: కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో నలుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదం
నెల్లూరు జిల్లా కావలి రూరల్ అలిగుంటపాలెం క్రాస్ రోడ్ వద్ద కారు టైరు పేలి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: