ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఆనకట్ట ఇన్ ఫ్లో లక్షా 13 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో లక్షా 13 వేల క్యూసెక్కులుగా ఉంది. జలాశయం 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 74 టీఎంసీలుగా ఉంది. జలాశయం పూర్తి సామర్థ్యం 77.988 టీఎంసీలు. నీటి విడుదల నేపథ్యంలో.. పెన్నా పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
సోమశిలకు భారీగా వరద..9 గేట్లు ఎత్తివేత - సోమశిల జలాశయానికి భారీీగా వరద
నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
![సోమశిలకు భారీగా వరద..9 గేట్లు ఎత్తివేత Floods continue in Somashila reservoir in Nellore district.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8954900-797-8954900-1601179771085.jpg)
సోమశిలకు భారీగా వరద