ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పులిచింతల మరింత పెరిగిన వరద ఉద్ధృతి, నిండుకుండలా సోమశిల - సోమశిల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి

Pulichintala and Somashila projects ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని జలాశయాలన్ని నిండు కుండలను తలపిస్తున్నాయి. పులిచింతల, సోమశిల ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

Pulichintala and Somashila projects
వరద ఉద్ధృతి

By

Published : Aug 29, 2022, 2:27 PM IST

Pulichintala projects పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగింది. 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2.42 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 2.21 లక్షల క్యూసెక్కులుగా ఉంది. విద్యుదుత్పత్తి కోసం 8 వేల క్యూసెక్కులు మళ్లిస్తున్నారు. ప్రస్తుత నీటినిల్వ 37.90 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ 45.77 టీఎంసీలు.

వరద ఉద్ధృతి

Somashila projects మరోవైపు నెల్లూరు జిల్లాలోని సోమశిల నిండుకుండను తలపిస్తోంది. దీని పూర్తి నీటిమట్టం 77.98 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుత నీటిమట్టం 70.15 టీఎంసీలుగా ఉంది. ఎగువ నుంచి సోమశిలకు 15,782 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఉత్తర, దక్షిణ కాల్వల ద్వారా దిగువకు 9,553 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details