నెల్లూరు మత్స్య శాఖ కార్యాలయం వద్ద మత్స్యకారుల సంఘం ధర్నాకు దిగారు. వేలం నిర్వహణ జీవోను వెంటనే రద్దు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. వేలం నిర్వహించి ప్రభుత్వమే చేపల అమ్మకాన్ని చేపట్టడం ద్వారా చెరువులను నమ్ముకున్న గిరిజన రైతులు, మత్స్యకారులు వీధిన పడతారని వాపోయారు. ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు.
'వేలం నిర్వహణ జీవోను ప్రభుత్వం రద్దు చేయాలి' - నెల్లూరులో మత్స్యకారుల సంఘం ఆందోళన
మత్స్యకారులు, గిరిజన రైతులు లీజ్ ఒప్పందాలతో నడుపుతున్న చెరువులను ప్రభుత్వం రద్దు చేసి వేలం నిర్వహించాలని చూస్తుందని నెల్లూరు మత్స్యకారుల సంఘం ఆరోపించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అనంతరం ఆ శాఖ సంయుక్త సంచాలకులు నాగేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు.
!['వేలం నిర్వహణ జీవోను ప్రభుత్వం రద్దు చేయాలి' fishermen society went on protest at nellore fisheries department fo justice](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8416859-404-8416859-1597404459588.jpg)
నెల్లూరులో ధర్నాకు దిగిన మత్స్యకారుల సంఘం