నెల్లూరు లస్సీ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ మొబైల్ దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో రూ.15 లక్షల విలువైన ఫోన్లు కాలి బూడిదయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత ఈ ప్రమాదం సంభవించడంతో.. అరికట్టడానికి అవకాశం లేకపోయింది.
కాలి బూడిదైన రూ.15 లక్షల విలువైన ఫోన్లు! - nellore crime
నెల్లూరు జిల్లా కేంద్రంలోని లస్సీ సెంటర్‌లో ఓ మొబైల్ దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ కారణంగా మంటలు చెలరేగడంతో.. దుకాణంలోని దాదాపు రూ.15 లక్షల విలువైన ఫోన్లు అగ్నికి ఆహుతయ్యాయి.
మొబైల్ దుకాణంలో అగ్ని ప్రమాదం
ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, పక్క దుకాణాలకు మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ అగ్నిప్రమాదంతో భారీగా ఆస్తినష్టం జరిగిందని దుకాణ యజమాని శ్రీనివాసులు రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
ఇదీచదవండి.