Farmers Midnight Protest : ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ.. నెల్లూరు జిల్లా కోవూరులో రైతులు ఆందోళనకు దిగారు. రాత్రి తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తర్వాత అక్కడే నిద్రించిన కర్షకులు.. ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. బీపీటీ రకం వడ్లను అధికారులు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోవూరు మండలంలోనే 13వేల ఎకరాల్లో వరి సాగు చేస్తే.. ఇందులో 7 వేల ఎకరాలు బీపీటీయేనన్నారు. ఇటీవల వరదలకు తీవ్రంగా నష్టపోయిన తాము.. అప్పులు చేసి మరీ పంటను సాగు చేసినట్లు వాపోయారు. ధాన్యం కొనకపోతే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కొద్దిరోజులుగా నిరసన తెలియజేస్తున్నా.. ప్రజా ప్రతినిధులు తమ గోడు పట్టించుకోలేదని వాపోయారు.
Farmers Midnight Protest : అర్థరాత్రి అన్నదాతల నిరసన... ధాన్యం మద్దతు ధర కోసం ఆందోళన.. - కొవూరులో అర్థరాత్రి రైతుల నిరసన
Farmers Midnight Protest : ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు చేయాలంటూ నెల్లూరు జిల్లా కోవూరు రైతులు అర్థరాత్రి ఆందోళనకు దిగారు. తహశీల్దార్ కార్యాలయం వద్దే నిద్రించి తమ కష్టాలు తీర్చాలని కోరారు. తమ సమస్యను పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు.
అర్థరాత్రి అన్నదాతల నిరసన...ధాన్యం మద్దతు ధర కోసం ఆందోళన..