Illegal Affair Killed Son : నెల్లూరు జిల్లా వింజమూరు గ్రామానికి చెందిన నవ్యభారతి, అదే గ్రామానికి చెందిన అబ్దుల్ బాషా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. ఆత్మకూరు మండలం కరటంపాడు సచివాలయంలో బాషా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న రషీదాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంపై పలుమార్లు నవ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా మార్పు రాకపోవడంతో విసిగిపోయిన ఆమె సచివాలయానికి వెళ్లి రషీదాతో గొడవపడటడంతో పాటుగా...భర్తపై నవ్యభారతి కేసుపెట్టింది. దీంతో కక్ష పెంచుకున్న బాష, బంధువుల ఇంట్లో తలదాచుకున్న నవ్యభారతిపై కత్తితో దాడికి యత్నించాడు. అడ్డుకోబోయిన నవ్యభారతి బంధువు నరేశ్, నరేశ్ స్నేహితులు ముఖేశ్, నాయబ్‌పైనా దాడి చేశాడు. బాధితురాలికి కొడుకు వరుసయ్యే నరేష్ కత్తిపోట్లతో అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నరేష్‌కు మూడు నెలల క్రితమే వివాహం అయ్యింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Illegal Affair Killed Son: ప్రేమ పెళ్లి.. వివాహేతర సంబంధం.. చివరికి అడ్డువచ్చిన వారిని..! - అక్రమ సంబంధం కేసులో భార్యపై భర్త కత్తితో దాడి
Extramarital affair causes for murder : వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ ప్రేమకు గుర్తుగా ముగ్గురు పిల్లలు జన్మించారు. కొన్నేళ్లుగా అతను వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో వద్దని వారించింది. అవతలి మహిళకు చెప్పింది. పెడచెవిన పెట్టడంతో..సహనం కోల్పోయి ఇద్దరిపై ఫిర్యాదు చేసింది. తమపైనే ఫిర్యాదు చేస్తావా? అని ఆగ్రహించిన భర్త కత్తితో భార్యపై దాడి చేయబోయాడు. ఆపేందుకు అడ్డువచ్చిన వారిపై కూడా దాడికి పాల్పడటంతో భార్య బంధువు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగింది. ఆ వివరాలు...
ప్రేమ పెళ్లి...అక్రమ సంబంధం...చివరికి అడ్డువచ్చిన వారిని...