కరోనా వ్యాప్తి నివారణకు నెల్లూరులో ఉన్న తెలుగుదేశం నాయకులు తమ వంతు సహకారం అందించారు. తెదేపా నేత నూడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో 50 వేల మాస్కులు, హోమియోపతి మందులను ప్రజలకు పంపిణీ చేశారు. డివిజన్ తెదేపా నాయకులకు వీటిని అందజేసి, వారి ద్వారా ప్రజలకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నారు. ప్రజలందరూ ఇళ్ల వద్దే ఉంటూ కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
50 వేల మాస్కులు పంపిణీ చేసిన నూడా మాజీ చైర్మన్ - nuda ex chairman distributing masks
నూడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు ప్రజలకు 50 వేల మాస్కులు, హోమియోపతి మందులు ఉచితంగా పంపిణీ చేశారు.
ప్రజలకు 50 వేల మాస్కులు పంపిణీ