ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కోవిడ్​ ఆస్పత్రుల్లో వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం: సోమిరెడ్డి - ఏపీలో కరోనా కేసులు

కోవిడ్​ ఆస్పత్రుల్లో కనీస వసతులను కల్పించటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. చాలాచోట్ల ఆక్సిజన్ల కొరత ఉందని.. అయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు ఏం చేస్తున్నారో అర్థంకాని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

ex minister somireddy chandramohan reddy
ex minister somireddy chandramohan reddy

By

Published : Aug 12, 2020, 3:51 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంపై తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అప్రమత్తంగా లేకుంటే దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ సరైన ప్రణాళికతో ముందుకు సాగాలని కోరారు. క్వారంటైన్​, ఐసోలేషన్​ సెంటర్లలో భోజనాలు సరిగా లేవన్నారు.

మందులు కూడా సరిగా ఇవ్వడం లేదని విమర్శించారు. సీఎం జగన్ ఒక్కసారైనా సంబంధిత కేంద్రాలను పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా... ఎందుకు సరిగా వినియోగించడం లేదని ప్రశ్నించారు. కొవిడ్​తో చనిపోయిన వారికి పది లక్షల రూపాయలను ఇవ్వాలని కోరినా ప్రభుత్వం స్పందించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details