ఎన్నికల కమిషన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత మాణిక్యాలరావు ఆరోపించారు. ఈవీఎంల పనితీరుపై అసత్య ప్రచారం చేస్తున్న వారిని ఈసీ నియంత్రించాలని ఆయన నెల్లూరులోని భాజపా కార్యాలయంలో కోరారు. ఎవరికి ఓటు వేసినా కమలం గుర్తుకే పడుతోందని చెబుతున్న చంద్రబాబు... తమకు మాత్రం 130 సీట్లు వస్తాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సుపరిపాలన అందిస్తున్నామని చెబుతున్న వారే ఇలా మాట్లాడటం తగదని హితవు పలికారు.
'ఈవీఎంలపై అసత్య ప్రచారం సరికాదు'
ఈసీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై నియంత్రణ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి మాణిక్యాల రావు డిమాండ్ చేశారు. ఎవరికి ఓటేసినా భాజపాకు పడుతుందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
ఈవీఎంలపై అసత్యప్రచారాన్ని నియంత్రించాలి:మాజీ మంత్రి మాణిక్యాలరావు