ప్రభుత్వం తెచ్చిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. నెల్లూరూ కలెక్టరేట్ వద్ద మూడో రోజు ఉద్యోగుల నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఏ లెక్కల ప్రకారం పీఆర్సీ ఇచ్చారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమండ్ చేసిన బండి శ్రీనివాసరావు.. ఆ నివేదికను బయటపెట్టాలన్నారు. జీవోలను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం మరింత ఉద్ధృతం అవుతుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు.
జీవోలు వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తాం: బండి శ్రీనివాసరావు - employees agitation at nellore collectorate
నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు హాజరయ్యారు.

employees agitation at nellore collectorate
TAGGED:
బండి శ్రీనివాసరావు