నెల్లూరులో ఈనాడు సిరి ఇన్వెస్టర్స్ క్లబ్ - ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్, జెన్ మనీ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించింది. నగరంలోని వాయుగండ్ల బ్రహ్మయ్య కళ్యాణ మండపంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ రీజనల్ మేనేజర్ వెంకట వినోద్... ఆర్థిక మాంద్యం ప్రభావం గురించి మధుపరులకు వివరించారు. ఆర్థిక వ్యవస్థ బాగుంటే మార్కెట్లు దీర్ఘ కాలానికి మంచి రాబడి అందించే అవకాశాలు ఉంటాయని జెన్ మనీ జనరల్ మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. డబ్బులు ఎలా ఆదా చేయాలి అనే అంశంపై క్షుణ్ణంగా వివరాలు తెలియజేశారు. ప్రతి మనిషి ఎంతో కొంత డబ్బు నిల్వ ఉంచుకోవాలని సూచించారు.
నెల్లూరులో మదుపర్లకు ఈనాడు సిరి అవగాహన సదస్సు - nellore city latest updates
ఈనాడు సిరి ఇన్వెస్టర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నెల్లూరులోని వాయుగండ్ల బ్రహ్మయ్య కళ్యాణ మండపంలో మదుపర్లకు సదస్సు నిర్వహించారు.
![నెల్లూరులో మదుపర్లకు ఈనాడు సిరి అవగాహన సదస్సు eenadu siri investors club in nellore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6008953-1047-6008953-1581201963431.jpg)
నెల్లూరులో మదుపర్లకు ఈనాడు సిరి అవగాహన సదస్సు