ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Earthquakes: జట్లకొండూరులో భూప్రకంపనలు...రిక్టర్‌ స్కేలుపై 3.6గా నమోదు - నెల్లూరు జిల్లా లేటెస్ట్ అప్​డేట్స్

Earthquakes: మనుబోలు మండలంలోని జట్లకొండూరు పొలాల్లో శనివారం అర్ధరాత్రి దాటాక భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై 3.6గా నమోదైందని ఎన్‌సీఎస్‌ తెలిపింది. భూ ప్రకంపనలతో ఎలాంటి నష్టం జరగలేదని తహసీల్దారు పేర్కొన్నారు.

Earthquakes in Nellore district
జట్లకొండూరులో భూప్రకంపనలు

By

Published : Apr 4, 2022, 9:55 AM IST

Earthquakes: నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని జట్లకొండూరు పొలాల్లో శనివారం అర్ధరాత్రి దాటాక భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.6గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 20 కి.మీ. లోతున ఈ ప్రకంపనలు సంభవించినట్లు పేర్కొంది. అర్ధరాత్రి దాటాక ఇంట్లోని గ్యాస్‌ సిలిండర్‌, బల్లలు కదిలినట్లు శబ్దం వచ్చిందని శకుంతలమ్మ తెలిపారు. భూ ప్రకంపనలతో ఎలాంటి నష్టం జరగలేదని తహసీల్దారు నాగరాజు వెల్లడించారు.

ఇదీ చదవండి:Offices: ప్రస్తుతానికి సర్దుకోవడమే.. డివిజన్‌, మండల స్థాయి కార్యాలయాల్లోనే

ABOUT THE AUTHOR

...view details