ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Suicide: దివ్యాంగ యువకుడి ఆత్మహత్య.. పోలీసుల వేధింపులే కారణమా..? - నెల్లూరు జిల్లాలో యువకుడి ఆత్మహత్య

Suicide: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పురుగుల మందు తాగి దివ్యాంగ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు వేధింపులే ఆత్మహత్యకు కారణమని ఆరోపిస్తున్నారు. అసలేం జరిగిందంటే..?

suicide
యువకుడు ఆత్మహత్య

By

Published : Jul 29, 2022, 7:23 AM IST

Updated : Jul 29, 2022, 10:34 AM IST

Suicide: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో దివ్యాంగుడు తిరుపతయ్య ఆత్మహత్య వివాదాస్పదంగా మారింది. ఓ చోరీ కేసులో..... నిందితుడిగా ఉన్న తిరపతయ్యను మర్రిపాడు ఎస్​ఐ కొట్టి, వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని... తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. అనంతసాగరం మండలం గుడిగుంట గ్రామానికి చెందిన వికలాంగుడు తిరపతయ్య..మర్రిపాడు మండలం చుంచులూరు వద్ద తల్లిదండ్రులతో కలిసి పోలంలో కాపలా ఉంటున్నారు. ఇటివల పోలం కంచెకు వెసే.... వైర్లు చోరీ అయ్యాయి. తిరుపతయ్యపై అనుమానం వ్యక్తంచేసిన మరో రైతు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతయ్యను విచారించగా..చోరీ చేసిన విషయాన్ని ఒప్పుకుని..వైర్లు తిరిగి ఇచ్చేశాడు.

ఆ తర్వాత మండలంలో జరిగిన మిగతా చోరీలు కూడా నువ్వే చేశావంటూ...ఎస్సై వేధించడంతో పురుగులమందు తాగాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తిరపతయ్యను మొదటగా ఆత్మకూరు ఆసుపత్రికి అక్కడి నుంచి నెల్లూరుకి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడికి చేరుకున్న నెల్లూరు సీఐ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లకుండా అడ్డుపడి... ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి ఎంత డబ్బయిన భరిస్తామని చెప్పినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. వికాలంగుడైన తిరుపతయ్య చావుకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పోలీసులు మాత్రం కుటుంబ కలహలతో తిరుపతయ్య చనిపోయాడంటున్నారు. ఈ విషయం వివాదస్పదంగా మారడంతో..జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. మరోవైపు..మర్రిపాడు ఎస్సై.. వేధింపులకు 6 నెలల క్రితం కూడా ఓ వ్యక్తి చనిపోయినట్లు ఆరోపణలున్నాయి. గతంలో మృతుని బంధువులు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట కూడా ఆందోళన నిర్వహించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 29, 2022, 10:34 AM IST

ABOUT THE AUTHOR

...view details