D Forma Students Protest: జగనన్న విద్యా దీవెన ద్వారా ప్రభుత్వం తమ ఫీజులు చెల్లించాలని కోరుతూ... డాక్టర్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. జిల్లాలో డాక్టర్ ఫార్మసీ కోర్సులు అందించే కళాశాలలు ఎనిమిది వరకు ఉన్నాయి. కోర్సు పూర్తి చేసేందుకు ఆరు సంవత్సరాల సమయం పడుతుంది. ఎంట్రన్స్ పరీక్ష ద్వారా సీట్లు సాధించిన విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన కింద ఫీజు చెల్లిస్తామని... ప్రభుత్వం హామీ ఇచ్చిందని విద్యార్థులు చెబుతున్నారు. మొదటి ఏడాదికి 68వేలు రూపాయలు కళాశాలకు చెల్లించారని పేర్కొన్నారు. ఆ తరువాత నుంచి ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవటంతో... కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం తాము ఫార్మా-డీ ఐదవ సంవత్సరం చదువుతున్నామని... ఉన్న పళంగా లక్షల రూపాయల ఫీజులు చెల్లించలేమని విద్యార్థులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని... లేకపోతే తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫీజులు కట్టలేము...జగనన్న విద్యాదీవెన అందించండి... - D Forma Students Protest
D Forma Students Protest: జగనన్న విద్యా దీవెన ద్వారా ప్రభుత్వం తమ ఫీజులు చెల్లించాలని కోరుతూ... డాక్టర్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు.
D Forma students
TAGGED:
D Forma Students Protest