కరోనా కారణంగా మృతి చెందిన ఓ వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించేదుకు అధికారులు శ్మశానానికి తీసుకురాగా బోడిగాడితోట, వైకుంఠాపురం వాసులు అడ్డుకున్నారు. మృతదేహాన్ని ఊర్లోకి తీసుకారావొద్దని .. మహాప్రస్థానం వాహనాన్ని ఆ కాలనీల బయటే ఆపి..అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. నెల్లూరు నగరంలోని కుక్కలగుంటకు చెందిన 84ఏళ్ల వృద్ధురాలు కరోనా పాజిటివ్‌తో మృతి చెందారు. స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగగా.... వారికి నచ్చచెప్పే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
నెల్లూరులో వృద్ధురాలి అంత్యక్రియలు అడ్డుకున్న స్థానికులు
కరోనా కారణంగా మృతి చెందిన ఓ వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేయగా స్థానికులు అడ్డుకున్నారు. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూనే ఇప్పుడు కరోనా కారణంగా చనిపోయిన వృద్ధురాలి మృతదేహానికి అంత్యక్రియలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ ఘటన నెల్లూరు నగరంలోని బోడిగాడితోటలో జరిగింది.
నెల్లూరులో కరోనా మృతదేహాం ఖననం అడ్డుకున్న స్థానికులు