నెల్లూరు నగరంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని పద్మావతి సెంటర్, కరెంట్ ఆఫీస్ సెంటర్, కొండాయపాలెం గేట్ పరిధిలో రోడ్లపై భారీగా నీరు చేరింది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకట్రావుపల్లి ఎస్టీ కాలనీలో మూడు రోజులుగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది. నీళ్లు ఇళ్లల్లోకి చేరి వంట వండుకునే పరిస్థితి లేదు. తమ ఆకలి తీర్చమని ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట కేవిపీయస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన తహసీల్దార్ కృష్ణప్రసాద్ 30 మందికి భోజనాలు అందించారు. కాలనీ పరిస్థితిని పరిశీలించారు. ప్రభుత్వ పరంగా సహకారం అందించేందుకు ఉన్నతాధికారులకు తెలియచేస్తామని చెప్పారు.