రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులో రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
నెల్లూరు జిల్లా కాకుటూరులో రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన సీఎం.. అనంతరం మాట్లాడారు. 'నా పాదయాత్రలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నా. గత ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. విపత్తులు వచ్చినప్పుడు ఆదుకోవడానికి గతంలో మనస్సున్న ప్రభుత్వం లేదు. 13 జిల్లాల్లోని రైతుల్లో ఆనందం చూసేందుకు ఈ పథకం' అని ముఖ్యమంత్రి అన్నారు.