నెల్లూరులో సినీనటి పాయల్ రాజ్ పుత్ సందడి చేశారు. నెల్లూరు గ్రామీణంలోని పెద్ద చెరుకూరు గ్రామంలో వెలసివున్న శ్రీ గంగా బాలత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి ఆలయానికి ఆమె విచ్చేశారు. కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నెల్లూరుకు రావడం ఆనందంగా ఉంది : పాయల్ రాజ్పుత్ - నెల్లూరు జిల్లా వార్తలు
సినీనటి పాయల్ రాజ్పుత్ నెల్లూరులో సందడి చేశారు. స్థానికంగా ఉన్న ఓ దేవాలయానికి వచ్చిన ఆమె కార్తిక మాసం పురస్కరించుకుని పూజలు చేశారు.
payal rajputh
సినీనటిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నెల్లూరుకు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పాయల్ రాజ్ పుత్ చెప్పారు. ప్రస్తుతం త్రీ రోజెస్ సినిమాలో నటిస్తున్నానని, షూటింగ్ జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆమె తెలిపారు.
ఇదీ చదవండి :శ్రీశైలంలో వైభవంగా కార్తిక పౌర్ణమి వేడుకలు