సిమెంట్ బల్లపై పడుకున్న భర్తను చూసుకుంటూ...లేవలేక... నడవలేక... బయటకు వెళ్లే ఓపిక లేక బాధపడుతున్న ఈ వృద్ధురాలి పేరు చోటీబీ. నెల్లూరు నగరం ధనలక్ష్మీపురంలో భర్త రహంతుల్లాతో కలసి ఉండేది. వీరికి ఐదుగురు సంతానం. ముగ్గురు మగపిల్లలు కాగా..ఇద్దరు అమ్మాయిలు. ఉన్నదాంట్లో హాయిగా జీవిస్తూ.. ఉన్న ఆస్తులు అమ్మి అందరికీ పెళ్లిళ్లు చేశారు. బాధ్యతలూ నెరవేర్చి వృద్ధాప్యంలో సంతోషంగా ఉండాలనుకున్న వీరి బతుకులు ప్రస్తుతం రోడ్డున పడ్డాయి. నగరంలోని పశువైద్య కేంద్రం గోడ...ఈ పండుటాకులకు నీడనిచ్చింది.
నడిరోడ్డు పై వదిలేశారు..
కుటుంబం కోసం తల్లిదండ్రులు ఇంత చేసినా కన్నబిడ్డలకు మాత్రం కనికరం లేకుండా పోయింది. 80 ఏళ్ల తండ్రి, 70ఏళ్ల తల్లిని రోడ్డుపైనే వదిలేశారు. రాత్రికి రాత్రే.. ఆటోలో తీసుకొచ్చి రోడ్డున పడేశారు. ఆస్తులు అమ్మించి... అప్పులు తీర్చుకున్న కొడుకులకు... వారిని తమ వద్దే ఉంచుకోవాలనే ఆలోచన మాత్రం రాలేదు. కొడుకులు చూస్తారని కూతుళ్లు... కూతుళ్లు చూసుకుంటారని కొడుకులు.. వంతులు వేసుకుంటున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి చూస్తున్న స్థానికులు అన్నం పెడుతుంటే... జీవనం సాగిస్తున్నారు.
ఉన్నదంతా ఊడ్చేశారు..