రాష్ట్రంలో అధికార పార్టీ దాడులు అధికమయ్యాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రజాప్రతినిధులు దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. వైకాపా బాధితులకు తాము అన్ని విధాలా అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. నెల్లూరులో రెండోరోజు పర్యటిస్తున్న చంద్రబాబు నగరంలో ఓ గార్డెన్స్‌లో వైకాపా, పోలీసుల బాధితులతో సమావేశమయ్యారు. అధికార అండతో దౌర్జన్యాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని... బాధితుల తరపున తామే పోరాడుతామని హామీ ఇచ్చారు.
'వైకాపా బాధితుల తరఫున మేమే పోరాడతాం' - తెదేపా శ్రేణులపై వైకాపా నేతల దాడులు
వైకాపా దాడుల్లో నష్టపోయిన కుటుంబాలను పార్టీ తరఫున ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. నెల్లూరు నగరంలోని ఓ గార్డెన్స్‌లో వైకాపా బాధితులతో చంద్రబాబు సమావేశమయ్యారు. తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయించే పోలీసులపై కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.
చంద్రబాబు
వైకాపా అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో దాడులు అధికమయ్యాయని, దౌర్జన్యాలు చేసినవారే బాధితులపై కేసులు పెట్టే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలకు వత్తాసుగా పోలీసులు కేసు నమోదు చేయడం దారుణమన్నారు. ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో దాడుల సంస్కృతి తాము ఎన్నడూ చూడలేదన్నారు. దొంగ సారా, బెట్టింగ్ కేసుల్లో ఉన్న ఎమ్మెల్యేలు రౌడీల్లా తయారయ్యారని విమర్శించారు.
ఇదీ చదవండీ... కొండవీడుకోట అందాలు చూద్దం రారండీ!
Last Updated : Oct 15, 2019, 5:55 PM IST