ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Chandrababu Naidu visit Nellore: నెల్లూరు జిల్లా వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన - Chandrababu visits flood victim at Nellore district

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ నెల్లూరు(Chandrababu Naidu visit Nellore) జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా.. ఆయా ప్రాంతాల్లోని వరద బాధితులను చంద్రబాబు పరామర్శిస్తారు.

నెల్లూరు జిల్లా వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
నెల్లూరు జిల్లా వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

By

Published : Nov 25, 2021, 4:56 AM IST

Chandrababu Naidu visit Nellore: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ నెల్లూరు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈమేరకు ఆయన.. మధ్యాహ్న నెల్లూరుకు చేరుకుంటారు. స్థానిక దీండయాల్ నగర్ మీదుగా కొత్త కాలువ సెంటర్​లో ముంపు ప్రాంతాల్ని పరిశీలిస్తారు. జిల్లాలోని ఇందుకూరు పేట మండలంలో నారాయణరెడ్డి పేట నుంచి రావూరు వరకూ జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించి రావూరు గ్రామస్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు.

అనంతరం గంగపట్నం వెళ్లి అక్కడి ముంపు బాధితుల్ని చంద్రబాబు(Chandrababu Naidu today news) పరామర్శిస్తారు. గంగపట్నం నుంచి మైపాడు గేటు సెంటర్ మీదుగా నెల్లూరు పట్టణానికి రానున్నారు. నగరంలోని అహ్మద్ నగర్, గాంధీ గిరిజన కాలనీ, భగత్ సింగ్ కాలనీ, ఎన్టీఆర్ హౌసింగ్ ప్రాంతాలను పరిశీలించి బాధితులను ఇబ్బందులు అడిగి తెలుసుకోనున్నారు.

ABOUT THE AUTHOR

...view details