Road accident: నెల్లూరు జిల్లా సంగం మండలంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దువ్వూరు నుంచి వ్యవసాయ కూలీలతో చెన్నూరుకు వస్తున్న ఆటోను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆటో రహదారిపై పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో పదిమంది వ్యవసాయ కూలీలు ఉండగా.. అందులో ఆరుగురుకి గాయాలయ్యాయి. క్షతగాత్రులను బుచ్చి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆటోను ఢీకొట్టిన కారు, ఆరుగురికి తీవ్రగాయాలు - ఆటోను ఢీకొట్టిన కారు
Road accident కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం