ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి.. - nellore district news

నెల్లూరు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కరోనా సోకి చికిత్స పొందుతున్న తల్లిని చూసేందుకు వెళుతున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీ కొట్టింది.

road accident at nellore
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

By

Published : Jun 1, 2021, 9:58 PM IST

నెల్లూరు వెంకటాచలం పరిధిలోని కాకుటూరు వద్ద ప్రమాదం జరిగింది. ఆగిఉన్న ఓ లారీని కారు వెనుక నుంచి వేగంగా ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జైంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

కొవిడ్ తో నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని చూడటానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఇటీవల కరోనాతో వారి తండ్రి మృతి చెందగా తల్లి కోసం వెళుతూ.. మృతి చెందడంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

ABOUT THE AUTHOR

...view details