ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BLADE ATTACK IN NELLORE : గుడిసెలు తొలగించాలని దౌర్జన్యం.. నిరుపేదలపై బ్లేడ్లతో దాడి! - nellore crime

BLADE ATTACK IN NELLORE : నెల్లూరు నక్కా గోపాల్‌నగర్‌ కాలనీ వాసులపై దుండగుల దాడిచేశారు. గుడిసెలు తొలగించాలంటూ.. బ్లేడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో స్థానికులు, పలువురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి.

కాలనీ వాసులపై బ్లేడ్లతో దాడి
కాలనీ వాసులపై బ్లేడ్లతో దాడి

By

Published : Dec 23, 2021, 6:34 PM IST

BLADE ATTACK IN NELLORE : నెల్లూరులోని నక్కగోపాల్ నగర్‌లో స్థానికులపై దుండగులు దాడి చేశారు. 30వ డివిజన్‌లో గుడిసెలు తొలగించాలని బెదిరిస్తూ… బ్లేడ్‌లతో దాడికి పాల్పడ్డారు. స్థానిక మహిళలు దుండగులను అడ్డుకునేందుకు యత్నించినా వారినీ గాయపరిచారు. ఈ ఘటనలో టీఎన్ఎస్ఎఫ్ నేత ఆశిక్‌తో పాటు నలుగురు మహిళలు, ముగ్గురు యువకులు గాయపడ్డారు.

కాలనీ వాసులపై బ్లేడ్లతో దాడి

తీవ్రంగా రక్తం కారుతున్న బాధితులను నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ బాధితులను పరామర్శించారు. వైకాపా శ్రేణులే ఈ దాడికి తెగబడ్డాయని ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీచదవండి :

ABOUT THE AUTHOR

...view details