ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరదని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ అవినీతికి పాల్పడి రాజధానిని అసంపూర్తిగా వదిలేస్తే, వైకాపా ఆ రాజధానినే శ్మశానంగా మార్చిందని ఆయన నెల్లూరులో దుయ్యబట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే జరుగుతోందని చెప్పారు.
'ప్రాంతీయ పార్టీలతో ఏపీకి ఎలాంటి ప్రయోజనం లేదు'
ఏపీలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్రం సహకారంతోనే జరుగుతోందని మాజీమంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. తిరుపతి ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి రత్నప్రభను గెలిపించాలని కోరారు.
మాజీమంత్రి రావెల కిషోర్‌బాబు
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే అది వృథా అవుతుందని.. అవినీతి అరాచకంతో పాలన సాగిస్తున్న వైకాపాకు ఓటు వేస్తే రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారుతుందని విమర్శించారు. 45 ఏళ్ల పాటు ప్రజాసేవ చేసి.. భాజపా నుంచి పోటీ చేస్తున్న రత్నప్రభను గెలిపిస్తే కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉందని, తద్వారా రాష్ట్రాభివృద్ధికి మరింత తోడ్పాటు అందుతుందని చెప్పారు.
ఇదీ చదవండి: